ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్- కేటీఆర్‌

155
minister ktr
- Advertisement -

హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మరియు ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్ మ్యూచువల్ హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు తన గ్లోబల్ ఎల్.కె పాపులారిటీ సెంటర్ని హైదరాబాదులో ప్రకటించింది. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కే తారకరామారావు ఈ సెంటర్‌ను ప్రకటించారు. మాస్ మ్యూచువల్ దశలవారీగా హైదరాబాద్ నగరంలో ఈ గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ ద్వారా 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇప్పటికే ఈ గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ కోసం కంపెనీ పెద్దఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుందని, ఇప్పటిదాకా సుమారుగా 300కు పైగా ఉద్యోగులను కంపెనీ నియమించుకున్నదని తెలిపారు. రానున్న భవిష్యత్తులోనూ పెద్దఎత్తున ఉద్యోగాలను ఈ కంపెనీ కల్పించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఈ కంపెనీ లక్షా యాభై వేల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఈ రోజు కంపెనీతో జరిగిన సమావేశంలో మంత్రి కే తారకరామారావు వారితో మాట్లాడి, ప్రభుత్వం అన్ని విధాలుగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలకి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ పెట్టుబడులకు ఎంచుకున్నయని, ఈ రోజు 170 సంవత్సరాల వాణిజ్య, వ్యాపార చరిత్ర కలిగిన ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన మాస్ మ్యుచువల్ తన గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ కేంద్రాన్ని, అమెరికా అవతల తన మొదటి సెంటర్ ఏర్పాటు చేయడం అంటే, ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్న విషయం మరోసారి నిరూపితమైంది అన్నారు. హైదరాబాద్ నగరానికి కంపెనీని స్వాగతిస్తున్నట్లు తెలిపిన, మంత్రి కేటీఆర్ రానున్న కాలంలో కంపెనీ మరింత పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మాస్ మ్యూచువల్ ఇండియా కంపెనీ హెడ్ రవి తంగిరాల మాట్లాడుతూ “హైదరాబాద్ నగరానికి తమ కంపెనీ రావడం సంతోషకరంగా ఉందన్నారు. మాస్ మ్యూచువల్ తన గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రపంచంలోని అనేక నగరాలను పరిశీలించి, ఇక్కడ అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు మరియు ప్రభుత్వ ప్రో ఆక్టివ్ పాలసీల వలన హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. తమ కంపెనీ 1851లో ఏర్పాటై కోట్లాది మందికి ఆర్థిక సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ వస్తున్నదని రానున్న రోజుల్లో తమ కంపెనీ కార్యకలాపాలను, ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, ఈ మేరకు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ ద్వారా తమ కంపెనీ లక్ష్యాలు, అవసరాల మేరకు ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్ సహకారంతో ముందుకు పోతామన్న విశ్వాసాన్ని రవి తంగిరాల వ్యక్తం చేశారు.

తమ కంపెనీ అప్లికేషన్ డెవలప్మెంట్ మరియు సపోర్ట్, ఇంజనీరింగ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని, ఈ దిశగాపెద్ద ఎత్తున మరింతమందిని కంపెనీ నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే అమెరికాలో తమ కంపెనీకి 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని రవి తంగిరాల తెలిపారు. ఈ సమావేశంలో మాట్లాడిన కంపెనీ కోర్ టెక్నాలజీ హెడ్ ఆర్థర్ రీల్” ఇక్కడ అందుబాటులో ఉన్న టాలెంట్ పూల్ ద్వారా తమ ఇన్నోవేషన్ లక్ష్యాలను ఖచ్చితంగా అనుకుంటమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్ పాల్గొన్నారు.

- Advertisement -