ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడి త్రీ టౌన్ ప్రాంతాన్ని ఇప్పుడు అభివృద్ధిలో అన్ని ప్రాంతాలతో పాటు ముందు ఉంచిన ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అయజ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని త్రీ టౌన్ ప్మార్కెట్ రోడ్ నందు రూ.1.30 కోట్లతో సెంటర్ లైటింగ్ అండ్ డివైడర్, బీటీ రోడ్ ఆధునీకరణ, మూడు బొమ్మల సెంటర్ ప్రారంభ సభలో మంత్రి ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత అంతటి అభివృద్ధి చిన్న నగరం అయిన ఖమ్మం లోని జరిగిందని మంత్రి అన్నారు. త్రీ టౌన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నాకు అవకాశం కల్పించిన త్రీ టౌన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకే అనేక మంది వచ్చారు.. చతికిల పడ్డారు అని, అభివృద్ధిని మెచ్చారు కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఖమ్మం ప్రజలు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. గొల్లపాడు ఛానల్ ఆధునీకరణ తో త్రీ టౌన్ ప్రాంత ముఖ చిత్రం మారిపోయిందని, రానున్న రోజుల్లో మిగిలి ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి టౌన్ ప్రాంతాన్ని అద్దం తూనకలా మారుస్తామని, టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే అభివృద్ధి సాధ్యం అయిన విషయం గ్రహించాలన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకే కుటిల రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు, కుట్రదారులు.. రానున్న రోజుల్లో అభివృద్ధిని చూస్తున్న ప్రజలే వారికి సరైన బుద్ధి చెబుతారని వివరించారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణను టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి నిత్యం తెలంగాణ అభివృద్ధి కొరకే పాటుపడుతున్న మహనీయుడు మన కేసీఆర్ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు సహకారంతోనే మన ఖమ్మం శరవేగంతో అభివృద్ధి చెయ్య గలుగుతున్నానని పేర్కొన్నారు.
రానున్న సంక్రాంతి తర్వాత ఖమ్మం నగరమంతా మంచి నీటి కష్టాలు తీరనున్నాయని, కార్పొరేషన్ అంతటా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వనున్నట్లు వివరించారు. టేకులపల్లిలో నిర్మిస్తున్న 1150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరు పేదలకు అందించేందుకు సిద్ధం చేస్తున్నామని అందరూ వెళ్లి చూసి రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 60 స్థానాలకు 60 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని, ఖమ్మం అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి మన జీవితాల్లో వెలుగులు ఇచ్చిన కేసీఆర్కు కానుకను అందిద్దామన్నారు మంత్రి పువ్వాడ అజయ్.