చివర్లో నన్ను పిలిచావ్.. భార్యపై నాగ చైతన్య సెటైర్..

42
Naga Chaitanya

హీరోయిన్‌ సమంత హోస్ట్‌ చేస్తున్న స్యామ్ జామ్ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రెండు నెలల కింద మొదలైన ఈ షో తొలి సీజన్ పూర్తి కానుంది. ఇప్పటికే 7 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. అందులో విజయ్ దేవరకొండ నుంచి చిరంజీవి, అల్లు అర్జున్ వరకు చాలా మంది గెస్టులు వచ్చారు. ఇక చివరి ఎపిసోడ్ కోసం నాగ చైతన్య వచ్చాడు. అయితే చైతూ అందరికంటే చివర్లో వచ్చాడు. ఇక ఈ ఎపిసోడ్‌ ఎంతో ఆసక్తికరంగా సాగినట్లు తెలిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో సమంతపై చై పంచుల మీద పంచులు వేశాడు. అయితే తొలి సీజన్‌లో లాస్ట్‌ గెస్ట్‌గా వచ్చిన చైతూ.. దీనిపై కూడా సెటైర్లు వేశాడు. వీడు ఇంట్లోనే పడుంటాడు కదా.. ఎప్పుడు పిలిచినా వస్తాడులే అనుకుని చివర్లో నన్ను పిలిచావ్ అంటూ భార్యపై సెటైర్ వేశాడు.

ఆ తర్వాత నాకు హోస్టుగా ఎన్ని మార్కులు వేస్తావ్ అంటూ అడగ్గా.. నీకు అడ్వైస్ ఇస్తే తీసుకుంటావా.. ఇంట్లోనే తీసుకోవు కదా అంటూ మరో పంచ్ వేశాడు చై. వరుసగా భార్యను టార్గెట్ చేస్తూ పంచులు వేస్తూనే ఉన్నాడు నాగ చైతన్య. దాంతో సమంత మొహం చిన్నబోయింది. అంతేకాదు వంటల గురించి అడిగితే అసలు నువ్వెప్పుడు చేశావ్ వంట.. మొత్తం మంటేగా అంటూ మరో సెటైర్ వేసాడు. కనీసం నేను కాలేజ్ వెళ్లాను.. నువ్వు అసలు కాలేజ్ మొహమైనా చూసావా అంటూ రెచ్చిపోయాడు.

గ్యాప్ లేకుండా సమంతతో ఆడుకున్నాడు చైతూ. మధ్యలో సమంత ఆపాలని ట్రై చేసినా కూడా ఎక్కడా బ్రేకులు వేయలేదు ఈయన. ఇక్కడ షోకు వచ్చే గెస్టులను రోస్ట్ చేయడం నీకు తెలుసు.. కానీ ఇప్పుడు వచ్చిన గెస్టుకు నీ గురించి అంతా తెలుసు.. అందుకే నన్ను రోస్ట్ చేయలేవు అంటూ సమంతపై రివర్స్ కౌంటర్స్ వేశాడు చైతూ. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. రెండు నిమిషాల ప్రోమోలోనే సమంతపై ఇన్ని పంచులు ఉంటే ఫుల్ ఎపిసోడ్‌లో.. ఇక అది వేరే లెవెల్‌లో ఉంటది.ఈ ఎపిసోడ్ జనవరి 8న ప్రసారం కానుంది.

Sam Jam Season Finale Glimpse | Samantha, Naga Chaitanya | An aha Original | Premieres January 8