విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విద్యాశాఖ, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్’ ఛాలెంజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి కేటీఆర్.
ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించి, వారితో ముచ్చటించారు.ప్రతిస్టాల్‌ను సందర్శించి, అక్కడ విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అందరిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా బషీరా అనే అమ్మాయి తన కుటుంబ సమస్యలను కేటీఆర్‌కు చెప్పగా చలించి పోయారు. మా నా న్నకు ఐదేండ్ల క్రితం పక్షవాతం వచ్చింది. నేను ఏడాది స్కూల్ బంద్‌చేసి నాన్నకు సపర్యలు చేశా. ఇప్పుడు వీల్‌చైర్, కర్ర పట్టుకుని నడుస్తున్నారు. అమ్మ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నది. మా నాన్న ఇబ్బందులు తీ ర్చడానికి వీల్‌చైర్‌ను తయారుచేశాం. మాకు సొంతిల్లు లేదు సార్ అని తెలపగా అధికారులకు చెప్పి డబుల్ బెడ్‌రూం ఇంటిని మంజూరుచేయిస్తాం అని చెప్పగా ఆ విద్యార్థిని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.