కాంటాక్ట్ ఫార్మింగ్‌ ఆలోచన లేదు!

198
contract farming
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 41వ రోజుకు చేరింది. కేంద్రం తెచ్చిన చట్టాలు కార్పొరేట్లకే మేలు చేసేందుకేనని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అంబానీ,అదానీలకు మేలు చేసేందుకేనని విమర్శలు వస్తున్న తరుణంలో రిలయన్స్ స్పందించింది.

రైతులతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవ‌డం కానీ, కార్పొరేట్ ఫార్మింగ్ వ్యాపారం చేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని రిల‌య‌న్స్ సంస్థ వెల్లడించింది. తామెప్పుడు వ్య‌వ‌సాయ భూముల్ని.. కార్పొరేట్ ఫార్మింగ్ కోసం లీజు తీసుకోలేద‌ని తెలిపింది రిలయన్స్.

తామెప్పుడు ఆహార ధాన్యాల‌ను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయ‌లేద‌ని…. త‌మ‌కు స‌ప్లై చేసేవాళ్లు మాత్రం రైతుల నుంచి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కే ఆహార ఉత్ప‌త్తుల్ని కొనుగోలు చేస్తార‌ని తెలిపింది.

- Advertisement -