సుహాస్ హీరోగా ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్’..

285
Actor Suhas
- Advertisement -

ప్ర‌తిభావంతులైన కొత్త‌వాళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ సంయుక్త భాగ‌స్వామ్యంతో చిత్రాలు నిర్మిస్తామ‌ని ఇటీవ‌ల చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్‌, ల‌హ‌రి ఫిలిమ్స్ అనౌన్స్ చేశాయి. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా నేడు త‌మ తొలి చిత్రం ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్’ను అనౌన్స్ చేస్తూ, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆ బ్యాన‌ర్స్ రిలీజ్ చేశాయి. ‘క‌ల‌ర్ ఫొటో’ సినిమాలో చేసిన‌ అద్భుత‌మైన అభిన‌యంతో త‌న‌దైన ముద్ర‌వేసిన సుహాస్‌, ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’గా టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు.

ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రాన్ని అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహ‌ర్ నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ప‌ద్మ‌భూష‌ణ్‌గా సుహాస్ క‌నిపిస్తున్నారు. ఆయ‌న చేతిలో త‌ను రాసిన తొలి పుస్త‌కం ‘తొలి అడుగు’ క‌నిపిస్తోంది. చూడ్డానికి సింపుల్‌గా ఉన్నా, సినిమా కాన్సెప్ట్‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తూ ఆక‌ట్టుకుంటోంది పోస్ట‌ర్‌.

త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లుకానున్న ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్’ 2021 మ‌ధ్య‌లో విడుద‌ల కానున్న‌ది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్‌, ల‌హ‌రి మ్యూజిక్ సంయుక్త భాగ‌స్వామ్యంలో నిర్మాణ‌మ‌య్యే చిత్రాల ద్వారా 2021లో మ‌రికొంత‌మంది ప్ర‌తిభావంతులైన యువ‌ద‌ర్శ‌కులు ప‌రిచ‌యం కాబోతున్నారు. రానున్న కొద్ది వారాల్లో వాటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్స్ రానున్నాయి.

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: ష‌ణ్ముఖ ప్ర‌శాంత్‌
ప్రొడ్యూస‌ర్స్‌: అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహ‌ర్‌
బ్యాన‌ర్స్‌: చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్‌, ల‌హ‌రి ఫిలిమ్స్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

- Advertisement -