టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు..

32
MLA Koneru Konappa

సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీల నుండి భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో 300 మంది భవన నిర్మాణ కార్మికులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ శంకర్‌, వైస్‌ ఎంపీపీ స్వదేశ్‌ శర్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మణ్‌, దర్ని రాములు, రాజన్న, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ, కార్మికుల అభ్యున్నతికి, సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత సంఘాలు కార్మికుల సంక్షేమాన్ని మర్చిపోయాయని‌, భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే, తనవంతు సహాయం చేస్తానని తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంఘానికి భవనం లేదని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో, భవనానికి అనువైన స్థలం కేటాయించి భవనం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కార్మికులకు భీమా సదుపాయం కల్పిస్తానని, ప్రభుత్వం తరపున కార్మికులకు సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.