కరోనా ఎఫెక్ట్…నుమాయిష్ వాయిదా

225
etela
- Advertisement -

కరోనా ఎఫెక్ట్‌తో ప్రతి ఏటా తొలి రోజున గ్రేటర్ ప్రజలను పలకరించే నాంపల్లి నుమాయిష్ వాయిదా పడింది.నుమాయిష్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ అధ్య‌క్షుడు, రాష్ర్ట మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. త్వరలోనే నుమాయిష్ కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపారు ఈటల.

ప్రతీ ఏటా జన‌వ‌రి 1 నుండి ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు 45 రోజుల పాటు నుమాయిష్‌ జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1500 నుంచి 2 వేల వ‌ర‌కు చిన్న వ్యాపారులు స్టాళ్ల‌ను ఏర్పాటు చేసేవారు. పిల్ల‌లు ఆడుకునే ఆట‌బొమ్మ‌ల నుంచి గృహోపకరణాలు వరకు ఇక్కడ అమ్మకానికి వచ్చేవి.

- Advertisement -