జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్కిల్ డెవలప్ మెంట్ పై అవగాహన సదస్సు ఏర్పాటైంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పులఈశ్వర్ యువతను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో మంచిగా స్థిరపడేందుకు ప్రతి ఒక్కరికి ఓపిక అనేది చాలా అవసరం. ఆకలి అయినప్పుడే అన్నం, పేదరికంలోనే డబ్బు,సమయం గడిచినప్పుడే కాలం విలువలు తెలిసివస్తాయన్నారు. పుస్తకాలను ఓపిక, ఏకాగ్రతలతో చదివితేనే అర్థమవుతుంది. అలాగే,ఏ పనినైనా ఓపికతో నేర్చుకోవడం,అందులో నిమగ్నమై చేయడం వల్లే అందులో నాణ్యత ఉంటుంది, వస్తుంది. యువత వివిధ అంశాలలో నిపుణుల చేత శిక్షణ తీసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. దీనిని జగిత్యాల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాం, ఇక్కడ విజయవంతమయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం మొత్తం విస్తరింపజేసే అవకాశముందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం స్నానం,బట్టల సబ్బులు,షాపుల తయారీలో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది, తర్వాత దీనిని 300 ఉత్పత్తులకు విస్తరిస్తాం. మన ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉంటే మంచి మార్కెట్ కూడా లభిస్తుంది. ఆ యా అంశాలలో శిక్షణ పొంది దరఖాస్తు చేసుకునే వారికి రుణాలతో పాటు మార్కెట్ సౌకర్యాన్ని కూడా ఎస్సీ కార్పొరేషన్ కల్పిస్తుంది. నేర్చుకునే అంశంలో,పనిలో స్కిల్ ఉంటే ఇక్కడనే కాదు, ముంబాయి, దుబాయ్,అబుదాబీలలో కూడా మంచి జీతంతో ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ,స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు డాటాప్రో,రైస్, జాగృతి ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సోసైటీ,ఎన్ఎస్ డిసి,పిఎంకెవివై,డిడియు-జికె, స్కిల్ ఇండియా నుంచి హాజరయ్యారు.
వీరు ఆ యా అంశాలలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని,స్థిరపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న. ఈ సదస్సులో సుమారు 1200 మంది యువత తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇది ఆషామాషీ సదస్సు కాదు,మీ అందరికి మంచి జరగాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేశాం, దీనిని అర్థం చేసుకుని శ్రద్ధాసక్తులతో శిక్షణ తీసుకోండి అని మంత్రి సూచించారు.ఈ సదస్సులో జెడ్పీ ఛైర్మన్ వసంత, జాయింట్ కలెక్టర్ రాజేశం, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ ,గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఇడిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అంతకు ముందు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ ప్రారంభించడం జరిగింది. అలాగే బంజేరుపల్లి లంబడితాండ (బి) గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 64 లక్షల అంచనా వ్యయంతో సిసి మరియు బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్.