వృక్షవేదం పుస్తకంను కేటీఆర్‌కు అందజేసిన ఎంపీ సంతోష్…

274
ktr
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రచురించి తీసుకు వచ్చిన “వృక్ష వేదం” పుస్తకంను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా పుస్తకాన్ని చూసిన కేటీఆర్ చాలా అద్భుతంగా ఉంది అని తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన అడవులను, పకృతి అందాలను చాలా అద్భుతంగా చూపించారని అభినందించారు.

పర్యావరణ ప్రేమికులకు ఈ పుస్తకం ఎంతో ఆనందాన్ని ప్రజల్లో పచ్చదనం పట్ల చైతన్యాన్ని తీసుకువస్తుందని అన్నారు.ఇంత అద్భుతంగా “వృక్ష వేదం” పుస్తకాన్ని తీసుకు వచ్చిన రాజ్యసభ సభ్యుల జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

- Advertisement -