టీమిండియాకు విషెస్ తెలిపిన వెంకీ..

51
venkatesh

ఆసీస్‌తో మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు క్రీడా,సినీ అభిమానులు రహానే సేనపై ప్రశంసలు గుప్పించారు.

తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా భార‌త టీంకు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. అద్భుత విజ‌యం సాధించినందుకు అభినంద‌న‌లు. టీం మొత్తం క‌లిసిక‌ట్టుగా ఆడ‌డం వ‌ల‌న ఇండియా మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించింద‌ని పేర్కొన్నారు.

మెల్‌ బోర్న్ టెస్టులో స్వల్ప లక్ష్యం 70 పరుగులతో బరిలోకి దిగిన భార‌త్ రెండు వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించింది. దీంతో తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మూడో టెస్ట్ జ‌న‌వ‌రి 7న జ‌ర‌గ‌నుంది.