హైదరాబాద్‌లో ఇద్దరికి కొత్తరకం కరోనా

147
covid 19
- Advertisement -

ప్రపంచ దేశాలను కొత్తరకం కరోనా వైరస్ బయపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా బ్రిటన్ నుండి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. అయితే భారత్‌లో యుకే రిటర్న్‌లో ఆరుగురికి కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు వెల్లడించింది కేంద్రం.

బెంగ‌ళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో మూడు శాంపిళ్లు, హైద‌రాబాద్ సీసీఎంబీలో 2 శాంపిళ్లు, పుణె ఎన్ఐవీలో ఒక శాంపిల్‌లో కొత్త ర‌కం వైర‌స్‌ను గుర్తించిన‌ట్లు తెలిపింది. వీరితో పాటు వీళ్లను కాంటాక్ట్ అయిన వారందరిని క్వారంటైన్‌కు తరలించినట్లు కేంద్రం తెలిపింది.

భారత్‌తో పాటు డెన్మార్క్‌, నెద‌ర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇట‌లీ,స్వీడ‌న్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జ‌ర్లాండ్‌, జ‌ర్మ‌నీ, కెన‌డా, జ‌పాన్‌, లెబ‌న‌న్‌, సింగ‌పూర్ దేశాల‌కూ యూకేలో క‌నిపించిన ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ పాకింది.

- Advertisement -