- Advertisement -
సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ప్రత్యూష- చరణ్ రెడ్డిల వివాహం జరిగింది. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజుతో పాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఇక ఆదివారం ప్రత్యూషను పెండ్లి కూతురుగా ముస్తాబు చేశారు సీఎం కేసీఆర్ సతీమణి శోభ. ప్రత్యూషకు పట్టువస్ర్తాలు, వజ్రాల నెక్లెస్ బహుకరించి ఆశీర్వదించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు మహిళ ఐఏఎస్ అధికారిణులు సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
- Advertisement -