ఎట్టకేలకు అమెరికా ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో దిగొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా ఉద్దీపన ప్యాకేజీ 900 బిలియన్ డాలర్లకు అమోదముద్ర వేశారు.
ఇప్పటి వరకు ఇస్తున్న నిరుద్యోగ భృతికి శనివారం అర్ధరాత్రితో గడువు ముగియనుంది. ఆలోగా కొత్త బిల్లుపై ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది. కానీ వారాంతాన్ని గడపడానికి ఫ్లోరిడా పామ్ బీచ్‌కి వెళ్లిన ట్రంప్… బిల్లుపై సంతకం చేయకపోగా కొత్త వాదన లేవనెత్తడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఇల్లు గడిపేందుకు అవస్థలు పడుతున్న నిరుద్యోగులు… సకాలంలో సహాయం అందకపోతే రోడ్డున పడతామని ఆందోళన చెందారు.
ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉద్దీపన ప్యాకేజీ బిల్లును ట్రంప్ తెచ్చారు. కరోనా కారణంగా కుదేలైన వ్యాపార సంస్థలతో పాటు పౌరులకు ప్రయోజనం కలగనుంది. అమెరికా సంస్థలు, పౌరులకు వివిధ రూపాల్లో ప్యాకేజీ కింద ఆర్థిక భరోసా కల్పించనున్నారు.