అయ్యప్ప స్వాములకు మంత్రి ఎర్రబెల్లి విషెస్..

188
errabelli
- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గం, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో కన్నె స్వాముల దీక్షా స్వీకరణ కార్యక్రమంలో సతీ సమేతంగా, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.ఈ సందర్భంగా…దాదాపు 500 మంది కన్నె స్వాములు దీక్ష తీసుకున్నారు. కన్నె స్వాములకు దీక్ష ను అందచేసిన గురు స్వామి నరసింహ య్య.అయ్యప్ప స్వామి వారి విగ్రహం ఎదుట… కొబ్బరికాయలు కొట్టి కన్నె స్వాముల తో దీక్ష స్వీకరింప చేశారు మంత్రి దంపతులు.

ఈ సందర్భంగా…మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, నూతనంగా మాల వేసుకుంటున్న, అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న కన్నె స్వాములకు శుభాకాంక్షలు తెలిపారు. 20ఏళ్లుగా నేను కూడా అయ్యప్ప స్వామి భక్తుడిని….వర్ధన్నపేట లో ఒక గుడి కూడా కట్టించాను అని తెలిపారు.భక్తి శ్రద్ధలతో పని చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. కష్టాలు తీరుతాయి. మంచి జరుగుతుంది. అంతా క్షేమంగా.. సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

మనం చేసుకునే పుణ్యాలు మన పిల్లల మీద ప్రభావాన్ని చూపుతాయి….పాపాలు కూడా అదే స్థాయిలో తమ ప్రభావాన్ని చూపుతాయి అని నమ్ముతాను..పాపాలు చేసే వాళ్లకు… తాత్కాలికంగా సుఖాలు కలగవచ్చు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే… నిజమైన భక్తులకు ఆలస్యమైనా తప్పకుండా మంచే జరుగుతుందన్నారు.

ఈ రోజు దీక్ష తీసుకుంటున్న వాళ్ళు త్రికరణ శుద్ధితో పూజలు చేయాలి…దేవుడిని గట్టిగా… నమ్మితే, కొరుకున్నవి జరిగి తీరుతాయన్నారు.మనసు లగ్నం చేస్తే కానిదేది లేదు…సంకల్పం గట్టిగా ఉండాలన్నారు. భక్తి కేవలం విశ్వాసం మాత్రమే కాదు…. అదొక జీవన విధానం…అయ్యప్ప భక్తుల జీవన విధానం ఎంతో శ్రేష్ఠమైనది. అందరూ ఆచరించవలసిన ది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.

- Advertisement -