ప్రత్యూషను ఆశీర్వదించిన సీఎం సతీమణి శోభ..

32
cm

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ – శోభమ్మ గార్ల దత్త పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి ప్రత్యూష వివాహం ఇవాళ (28.12.2020) చిరంజీవి చరణ్ రెడ్డితో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో పెళ్లి కూతురును చేసే కార్యక్రమంలో వధువుకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి, ఆశీర్వదించిన ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి సతీమణి శ్రీమతి శోభమ్మ. ఈ కార్యక్రమంలో గిరిజన, మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా భివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య , శాఖ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.