రాష్ట్రంలో రాగల 3రోజులు పొడి వాతావరణం..

43
Weather forecast

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఈశాన్య / తూర్పు దిశ నుండి గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాలలో శీతల గాలుల పరిస్థితి నెలకొన్నది. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు తెలంగాణ జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు తెలంగాణ జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.