బాక్సింగ్ డే టెస్టు…ఆసీస్ తడబాటు

199
ind vs aus
- Advertisement -

భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బౌలర్లు రాణించారు. కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ ఆరంభంలోనే వికెట్లను కొల్పోయింది.

10 పరుగులకే తొలి వికెట్ కొల్పోయిన ఆసీస్‌ తర్వాత మరో రెండు వికెట్లను 38 పరుగులకే కొల్పోయి కష్టాల్లో పడింది.జో బ‌ర్న్స్ డకౌట్ కాగా, మ‌రో ఓపెన‌ర్ మాథ్యూ వేడ్ 30 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. 48 ర‌న్స్ చేసిన ల‌బుషేన్ వికెట్‌ను సిరాజ్ తీశాడు. ట్రావెస్ హెడ్ 38 ర‌న్స్ చేసి బుమ్రా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

దీంతో టీ విరామ స‌మ‌యానికి 5 వికెట్లు కోల్పోయి 136 ర‌న్స్ చేసింది ఆసీస్. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్‌, బుమ్రాలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆరంగేట్ర మ్యాచ్‌లో హైద‌రాబాదీ స్పీడ్‌స్ట‌ర్ సిరాజ్ ఖాతాలో ఒక వికెట్ ప‌డింది.

- Advertisement -