దేశంలో 24 గంటల్లో 22,272 కరోనా కేసులు

66
covid 19

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 22,272 కేసులు నమోదుకాగా 251 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,81,667 యాక్టివ్ కేసులుండగా 97,40,108 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 1,47,343కు చేరింది. ఇప్పటివరకు 16,17,59,289 శాంపిల్స్‌ పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.