- Advertisement -
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఆందోళన 27వ రోజుకు చేరింది. చలిని సైతం లెక్క చేయకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు రైతులు.
సోమవారం 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టిన రైతులు… ఈ నెల 25నుంచి 27 వరకు హర్యానా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలును అడ్డుకోనున్నాయి. దీంతో పాటు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిరసనలు తెలపడానికి వేదిక చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దులు మూతపడ్డాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపిన అవి విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలతో తాము నష్టపోతామని రైతులు చెబుతుంటే…రైతుల బాగుకోసమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు జరిగిన ఆందోళనల్లో పదుల సంఖ్యలో రైతులు మరణించారు.
- Advertisement -