కమెడియన్ స్థాయి నుంచి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీయార్, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో పలు చిత్రాలు నిర్మించాడు. జూనియర్‌తో టెంపర్ సినిమా తర్వాత అదృశ్యమై పోయిన బండ్ల గణేష్ తాజాగా పవన్‌తో దిగిన ఫోటోను ట్వీట్ చేసి మళ్లీ వార్తల్లోకెక్కాడు. చాలాకాలం తర్వాత ఓ వెబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన గణేష్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు అని కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందించారు. అందరు రాజకీయనేతల మాదిరిగా కుంభకోణాలు చేయడం పవన్ కల్యాణ్ కు రాదు. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం తెలీదు. స్కీములు రచించడం రాదు. కానీ ప్రజ సేవ చేయాలన్న బలమైన సంకల్సం ఉంది’ అని బండ్ల గణేశ్ అన్నారు. అందుకే రాజకీయాలకు పనికిరాడేమో అని గణేష్ వ్యాఖ్యానించారు. అంతేగాదు ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ సీఎం కావడం తథ్యం అని జోస్యం చెప్పారు. నిజాయితీ ఉన్న ఆయనకు దేవుడు ఇచ్చే బహుమతి అదేనని చెప్పారు.
నా దేవుడు పవన్ కల్యాణ్‌కు ఎవరూ సహాయం చేయనవసరం లేదన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు స్వయంగా పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలు పవన్‌కు ఉన్నాయని స్పష్టం చేశారు. రవితేజ ఎంతో ఇష్టపడి తన దగ్గర పొలం కొనుక్కున్నాడని, అయితే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని తెలిపాడు. భవిష్యత్తులో కచ్చితంగా రవితేజ రుణం తీర్చుకుంటానని తెలిపాడు.
ఇక బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్‌ను క్షమాపణలు కోరాడు బండ్ల గణేష్. బాద్ షా సినిమా వల్ల నష్టపోయినప్పుడు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మీద అనవసరంగా మాట్లాడానని ఎన్టీఆర్ చాలా మంచిమనిషన్నారు. అలాగే ఓ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ, డ్రగ్స్ తీసుకుంటూ గడుపుతాడని, ఆయనతో పనిచేయడం తన దురదృష్టమన్నాడు. ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం బండ్ల గణేష్ నిరాకరించాడు. త్వరలోనే ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేస్తానని …. పరమేశ్వర బ్యానర్ పై చిన్న సినిమాలు తీస్తానని వెల్లడించాడు.