పోటీకి సై అంటున్న పవన్ – ఎన్టీఆర్ .. !

124
Pawan, Jr NTR Upcoming Movie On August 11

టాలీవుడ్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమవుతోంది. వేసవిలో మరింత హిట్ పెంచేందుకు మరో ఇద్దరు అగ్రహీరోలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందు రాగా బాలయ్య సైతం వందో సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణితో ముందుకొచ్చాడు. చాలా గ్యాప్‌ తర్వాత వీరిద్దరు సంక్రాంతి సమరానికి సిద్ధం కాగా రెండు సినిమాలు హిట్ కొట్టాయి.

Pawan, Jr NTR Upcoming Movie On August 11

తాజాగా మరోసారి టాలీవుడ్ సమరానికి సిద్ధమైనట్లు టాక్. అయితే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఢీ కొట్టేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. కాటమరాయుడు పూర్తికాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాపై పవన్ దృష్టిపెట్టనున్నాడు. ప్రస్తుతం బౌండ్ స్ర్కిప్ట్‌ను రెడీ చేయడంలో బిజీగా ఉన్న మాటల మాంత్రికుడు ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు. ఆగస్టు 11న సినిమాను విడుదల చేసేందుకు త్రివిక్రమ్ వ్యుహాలు రచిస్తున్నాడు.

మరోవైపు టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరుస విజయాలతో దూకుడు మీదున్న ఎన్టీఆర్‌ బాబీతో సినిమాకు పచ్చజెండా ఉపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం కథానాయికల అన్వేషణ జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండగా ఓ కథానాయిక రాశీఖన్నా ఎంపికైనట్లు తెలుస్తోంది. అనుకున్న సమయంలోగా సినిమా షూటింగ్ పూర్తిచేసి ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు.

Pawan, Jr NTR Upcoming Movie On August 11

సంక్రాంతికి మెగా – నందమూరి హీరోల సినిమాలు ఒకేసారి సందడి చేయగా, ఆగస్టులోను థియేటర్స్ దగ్గర అలాంటి సందడే కనిపించనుందన్న మాట.