బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 98 హైలైట్స్

218
episode 98
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 98 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 98వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులతో నాగ్ టాస్క్ ఇవ్వగా చివరగా సొహైల్ ఫినాలేకు అర్హత సాధించడంతో ఎపిసోడ్ ముగిసింది.

నాగ్ అదిరే లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మన టీవీ ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడారు. మీరు హౌస్‌లోకి వచ్చినప్పుడు మిగిలిన హౌస్‌మేట్స్‌పై మీ ఫస్ట్ ఇంప్రషన్ ఏంటి? ఈ 100 డేస్ జర్నీ తర్వాత ఫైనల్ ఇంప్రషన్ ఏంటి? మీకు నచ్చిన ముగ్గురు వ్యక్తులు, నచ్చని ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలపాలని కోరారు.

తొలుత హారికతో మొదలు పెట్టగా హారిక…. అఖిల్, అభిజీత్, మోనాల్ నచ్చారని…. అరియానా, సోహెల్ నచ్చలేదని తెలిపింది. అఖిల్ … హారిక, మోనల్,సోహెల్ నచ్చారని తెలపగా అరియానా, అభిజీత్ నచ్చలేదని తెలిపారు. అభిజీత్… అరియానా, సోహెల్, హారిక నచ్చారని..మోనాల్, అఖిల్ నచ్చలేదని తెలిపింది. మోనాల్…. అఖిల్, హారిక, సోహెల్ నచ్చారని అభిజిత్, అరియానా నచ్చలేదని తెలిపింది. ఇక అరియానా…..అభిజిత్, హారిక, మోనల్ నచ్చారని.. సోహెల్, అఖిల్ నచ్చలేదని తెలిపింది. సోహెల్….. అఖిల్, అభిజీత్, మోనాల్ నచ్చారని …..హారిక,అరియానా నచ్చలేదని తెలిపాడు.

తర్వాత అరియానా- సొహైల్ మధ్య సమోధ్య కుదుర్చారు నాగ్. ఇద్దరికి క్లాస్ పీకుతునే ఇంటి సభ్యులతో గొడవ గురించి అడిగి తెలుసుకున్నారు.ఆ గొడవలో అరియానా అంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని… ఉమెన్ కార్డ్‌ను తీసుకురావడం పెద్ద తప్పని నాగార్జున క్లాస్ పీకారు. బిగ్ బాస్ హౌస్‌లో ఆడ, మగ తేడాలేదని అంతా సమానమేనని గుర్తు చేశారు. సొహైల్‌కి కూడా క్లాస్ ఇస్తూనే కోపం తగ్గించుకోవాలని సూచించారు.

బిగ్ బాస్ ఫినాలేలో అడుగుపెట్టే ఐదుగురు ఫైనలిస్టుల్లో ఒక ఫైనలిస్టును శనివారం ప్రకటించారు నాగార్జున. ఇంటి సభ్యులతోనే కౌంట్ డౌన్ లెక్కపెట్టించి అఖిల్‌తో తొలి ఫైనలిస్ట్‌ను రివీల్ చేశారు. అఖిల్ ఉహించినట్లుగానే సొహైల్‌ ఫోటో ఉండటంతో సంతోషంతో ఎగిరి గంతులేశాడు. తనతో గొడవ పడిన అరియానాను కూడా హగ్ చేసుకొని ముద్దాడాడు.ఇక ఇవాళ మిగితా ముగ్గురు కంటెస్టెంట్‌ల పేర్లను ప్రకటించనున్నారు నాగ్.

- Advertisement -