తెలంగాణ కరోనా అప్‌డేట్..

146
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 78 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 573 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,77,724కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 7630 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 2,68,601 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో 1,493 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 96.71శాతానికి చేరిందని ఆరోగ్యశాఖ వివరించింది. ఇప్పటి వరకు 61,28,709 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -