- Advertisement -
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చ హాట్ హాట్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా ఇక్కడ నుండి ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై రకరకాల ఉహాగానాలు వెలువడుతున్నాయి.
అయితే ప్రముఖంగా కాంగ్రెస్ నుండి జానారెడ్డి పేరు వినిపిస్తుండగా ఎన్నికల్లో పోటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని వెల్లడించారు. రెండేళ్ల కోసం తాను పోటీచేసి ఏం లాభం అని ప్రశ్నించిన జానారెడ్డి… పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.
- Advertisement -