కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్. షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్‌గేట్ వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎంపీ కేశవరావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బంద్‌లో పాల్గొన్న కేటీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.
పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతు మెడకు ఉరి తాడుగా మారిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని అన్నారు.
అలంపూర్ వద్ద జాతీయ రహదారిపై మంత్రి నిరంజన్ రెడ్డి, తూప్రాన్ వద్ద మంత్రి హరీశ్‌రావు, హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, హన్మకొండ-వరంగల్ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలోని టెక్రియాల్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనలో పాల్గొన్నారు.