సోమవారం మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా రూ.218.06 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ ఆలీ పాల్గొన్నారు.
1.రూ. 1.25 కోట్లతో నిర్మించిన ఖానాపురం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
2.రూ. 2.85 కోట్ల రూపాయలతో బల్లెపల్లి అధునాతన వైకుంఠ ధామం ప్రారంభోత్సవం.
3.రూ. 18 కోట్ల రూపాయలతో పాండురంగాపురం-కోయచలక క్రాస్ రోడ్డు వరకు వెడల్పు, బిటి రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ ప్రారంభోత్సవం (కోయచలక సర్కిల్ వద్ద).
4.రూ.5 కోట్ల రూపాయలతో కోయచెలక రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు.
5.రూ. 8.4 కోట్ల రూపాయలతో రఘునాధపాలెం- చింతగుర్తి వరకు చేపట్టిన బిటి రోడ్డు వెడల్పు ప్రారంభోత్సవం.
6.రూ. 25లక్షలతో నిర్మించిన రఘునాధపాలెం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
7.రూ. 4.50 కోట్లతో నిర్మించిన NSP Canal Walk way ప్రారంభోత్సవం చేశారు.
8.రూ.70 లక్షలతో నిర్మించిన KMC పార్క్ (పట్టణ ప్రకృతి వనం, 22వ డివిజన్) ప్రారంభోత్సవం చేశారు.
9.రూ.11 లక్షలతో లకారం ట్యాంక్ బండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు.
10.రూ.77 కోట్ల రూపాయలతో నిర్మించిన దంసలాపురం ROB, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం చేశారు. అక్కడే సర్కిల్లో ప్రో. జయశంకర్ సార్ విగ్రహంను ఆవిష్కరించారు.
11.రూ.3 కోట్ల రూపాయలతో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు.
12.రూ.70 కోట్లతో సుందరయ్య నగర్ నందు గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ(ఓపెన్ జిమ్, పార్క్) ప్రారంభోత్సవం చేశారు.
13.రూ.27 కోట్లతో ఇల్లందు సర్కిల్లో నిర్మించిన ఐటి హబ్ ను ప్రారంభించారు.