రైతుల ధర్నాలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్..

126
ktr minister

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈనెల 8న భారత్‌ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల పరిధిలోని బూర్గుల గేట్ దగ్గర రైతులతో కలిసి ధర్నాలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. టీఆర్ఎస్ శ్రేణులు ఈ ధర్నాలో రాస్తారోకోలు, ధర్నాల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.