పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాలి.. కేంద్రంపై కేటీఆర్‌ ద్వజం..

132
minister ktr
- Advertisement -

సోమవారం రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఖ‌మ్మం జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగాంగా మంత్రి ల‌కారం ట్యాంక్‌బండ్‌పై మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. రూ. 1.25 కోట్ల‌తో పీవీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పీవీ శ‌త‌జ‌యంతి సంక‌ల‌నాన్ని కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తోపాటు మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పీవీ కాంస్య విగ్ర‌హాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని రాష్ర్ట ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో కోరుతున్నార‌ని తెలిపారు. పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వ‌డ‌మంటే కేంద్రం త‌న‌ను తాను గౌర‌వించుకోవ‌డ‌మే అని మంత్రి చెప్పారు. కేంద్రానికి నిబ‌ద్ధ‌త‌, చిత్త‌శుద్ధి ఉంటే పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించాల‌న్నారు. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ వ‌ర్సిటీకి పీవీ పేరు పెట్టాల‌ని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -