కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన విజయశాంతి..

137
Actor Vijayashanti
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈరోజు ఢిల్లీలో ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. వాస్తవానికి ఆమె రాజకీయ జీవితం బీజేపీలోనే మొదలైంది. 1998లో ఆమె సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరారు. బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీగా పనిచేశారు.ఆ తర్వాత విజయశాంతి సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని నెలకొల్పారు.

2009లో టీఆర్ఎస్ ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఉద్యమం కోసం ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆమె సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరాు. 2015లో హస్తం పార్టీలో చేరిన ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2020 డిసెంబర్ 7న మళ్లీ బీజేపీలో చేరారు విజయశాంతి. దీంతో ఎక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో మళ్లీ అక్కడికే వచ్చారు.1998లో బీజేపీలో చేరకముందు విజయశాంతి తమిళనాట అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలికారు. జయలలిత తరఫున ప్రచారం కూడా నిర్వహించారు.

- Advertisement -