భారత్‌ బంద్‌లో పాల్గొనండి: తలసాని

157
talasani
- Advertisement -

భారత్‌ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో టీఆర్‌ఎస్‌ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన తలసాని…. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే బంద్‌కు అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, కురుమ హేమలత, మహేశ్వరి, నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, ఉప్పల తరుణి, ఆకుల రూప, టీఆర్‌ఎస్‌ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -