అన్నదాతలకు మద్దతివ్వండి: మంత్రి సత్యవతి

143
minister sathyavathi
- Advertisement -

రైతులు, ప్రజలంతా ఆందోళనలో పాల్గొని అన్నదాతలకు మద్దతు ఇచ్చి రాస్తారోకోను విజయవంతం చేయాలని కోరారు మంత్రి సత్యవతి రాథోడ్. ఒకప్పుడు రెడ్యాల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవలు ఉంటే ఇప్పుడు సర్పంచ్ వెన్నెం శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో భక్తి వైపు పయనించడం సంతోషకరమన్నారు.

సోమవారం రెడ్యాల గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, మహమూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి… ఔరైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, అలాంటి రైతు నేడు ఢిల్లీలో రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాడన్నారు. మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రైతు ప్రభుత్వం వారికి మద్దతు ఇచ్చిందన్నారు.

- Advertisement -