సీఎం కేసీఆర్ 10న సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో ప్రభుత్వం పేదలకోసం రూ.163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
దీంతో పాటు రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను,మెడికల్ కళాశాలకు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రంగనాయకసాగర్ జలాశయం మధ్య రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని, మిట్టపల్లి రైతువేదికను, విపంచి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీశ్‌రావు తెలిపారు.
పట్టణంలోని చింతల్‌చెరువు వద్ద రూ.278 కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీంతో పాటు పొన్నాలలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం.