- Advertisement -
పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేయనున్నారు. రూ. 861.9 కోట్ల వ్యయంతో 64500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల భారీ రాజసౌధాన్ని నిర్మించనున్నారు. దీనికి టాటా సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. 21 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా కాలంలో భారీ నిధులు వెచ్చించి భవనం నిర్మిస్తుండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
- Advertisement -