కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను మరింత ఉదృతం చేయాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. ఢిల్లీ సరిహద్దు సింఘూ వద్ద సుమారు 32 రైతు సంఘాలు సమావేశం అయ్యాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి రేపు కేంద్రానికి ఆఖరి అవకాశమని తేల్చి చెప్పింది క్రాంతికర్ని కిసాన్ యూనియన్.
ఉద్యమం మరింత పెరిగితే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించాయి రైతు సంఘాలు. డిసెంబరు 5న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, కార్పొరేట్లకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు దహనం చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్ చేశాయి.తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఢిల్లీకి వెళ్లే ఇతర మార్గాలను నిర్బంధిస్తామని హెచ్చరించారు రైతు సంఘాల నాయకులు.3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతాయని స్పష్టం చేశాయి రైతు సంఘాలు.