మాతృభాషలో సాంకేతిక విద్య..విద్యాశాఖ కసరత్తు

96
ramesh

మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడంపై కేంద్ర విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.ఈ మేరకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్.ఈ టాస్క్​ఫోర్స్​కు ఛైర్మన్​గా ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి వ్యవహరించనున్నారు.మాతృభాషలో సాంకేతిక విద్యను అందించడంపై సలహాలు, సూచనలు స్వీకరించనుంది టాస్క్ ఫోర్స్.నెల రోజుల వ్యవధిలో విద్యా శాఖకు నివేదిక సమర్పించనుంది టాస్క్​ఫోర్స్​.