ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు మంత్రి కొప్పుల ఈశ్వర్. పెగడపల్లి మండలంలో రూ.2.80 కోట్ల నిధులతో చేట్టిన, చేపట్టే పలు అభివృధ్ది పనులను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కొప్పుల ఈశ్వర్….. రాష్ట్రం నుంచి వందలాది కోట్ల రూపాయలను పన్నుల రూపంలో కేంద్రం తీసుకెళుతున్నదని, తిరిగి రాష్ర్టానికి నిధులు ఇవ్వడంలో మోకాలడ్డుతోందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నదని, కరోనా సంక్షోభంలోనూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని అన్నారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, మరో వైపు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని వివరించారు.