పొలిటికల్‌, యాక్షన్‌ ధ్రిల్లర్‌గా ‘యమన్‌’….

261
Yamen Telugu Movie
- Advertisement -

‘నకిలీ’, ‘డా. సలీం’, ‘బిచ్చగాడు’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన విజయ్‌ ఆంటోని తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్‌ కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వరుస హిట్స్‌ సాధిస్తున్న విజయ్‌ ఆంటోని తాజాగా ‘యమన్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జీవశంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌, ద్వారక క్రియేషన్స్‌ పతాకాలపై మిర్యాల రవీందర్‌రెడ్డి ‘యమన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఫాదర్‌ సెంటిమెంట్‌తో పొలిటికల్‌, యాక్షన్‌ ధ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం జనవరి 25న హైదరాబాద్‌ రామానాయుడు ప్రివ్యూ ధియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ‘యమన్‌’ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో విజయ్‌ ఆంటోని, లైకా ప్రొడక్షన్స్‌ రాజా, ద్వారకా క్రియేషన్స్‌ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి, సమర్పకులు మిర్యాల సత్యనారాయణ రెడ్డి, పాటల రచయిత భాషశ్రీ, ప్రముఖ నిర్మాత కాశీ విశ్వనాధ్‌, చిత్ర నిర్మాత రవీందర్‌రెడ్డి సోదరులు కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Yamen Telugu Movie

చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”విజయ్‌ ఆంటోని ఒక టెక్నీషియన్‌గా గుర్తింపు తెచ్చుకొని ఆర్టిస్టుగా ‘డా. సలీం’, ‘నకిలీ’, ‘బిచ్చగాడు’తో సూపర్‌హిట్స్‌ సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫాదర్‌ సెంటిమెంట్‌తో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘యమన్‌’ చిత్రాన్ని రూపొందించారు. బైలింగ్వల్‌ చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం. లైకా ప్రొడక్షన్‌ వంటి బిగ్‌ బ్యానర్‌లో అసోసియేట్‌ అయి తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

Yamen Telugu Movie

లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధి రాజా మాట్లాడుతూ – ”లైకా ప్రొడక్షన్స్‌లో ఫస్ట్‌ ‘కత్తి’ చిత్రాన్ని నిర్మించాం. అది పెద్ద హిట్‌ అయింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ – శంకర్‌ల కాంబినేషన్‌లో ‘2.0’ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రానికి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించాం. ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఈ బ్యానర్‌లో బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలతో పాటు స్మాల్‌ బడ్జెట్‌ చిత్రాలు నిర్మించాలని అనుకున్నాం. విజయ్‌ ఆంటోని మంచి మిత్రుడు. డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ సాధిస్తున్నాడు. జీవశంకర్‌ స్క్రిప్ట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుండడంతో ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించాం. ఫాదర్‌ సెంటిమెంట్‌, పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది” అన్నారు.

Yamen Telugu Movie

రచయిత భాషాశ్రీ మాట్లాడుతూ – ”బిచ్చగాడు’, ‘భేతాళుడు’ చిత్రాలకు మాటలు, పాటలు రాశాను. ఆ రెండు చిత్రాలతో విజయ్‌ ఆంటోని గారితో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. ఇప్పుడు ఈ ‘యమన్‌’ చిత్రానికి మాటలు, పాటలు రాశాను. అశోక్‌ చక్రవర్తి క్యారెక్టర్‌లో హీరో విజయ్‌ ఆంటోని పర్ఫామెన్స్‌ ఇరగదీశాడు. ధర్మ సంస్ధాపన కోసం ఆనాటి అశోకుడు శత్రువులను చీల్చిచెండాడాడు. ఈ ‘యమన్‌’ చిత్రంలో ఈ అశోకుడు ఎవర్ని శిక్షించాడు అనేది చిత్ర కధ. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను” అన్నారు.

Yamen Telugu Movie

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ మాట్లాడుతూ – ”మదర్‌ సెంటిమెంట్‌తో రూపొందిన ‘బిచ్చగాడు’ చిత్రం బిగ్‌ హిట్‌ అయింది. ఇప్పుడు ఫాదర్‌ సెంటిమెంట్‌తో విజయ్‌ ఆంటోని చేసిన ‘యమన్‌’ చిత్రం కూడా ‘బిచ్చగాడు’ కంటే పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త డైరెక్టర్‌ ఎవరైనా కథచెప్పినా అందులో కొంచెం బాగున్నా ఆ డైరెక్టర్‌కి అన్ని ఫెసిలిటీస్‌ కల్పించి ఎంకరేజ్‌ చేస్తారు. అందుకు విజయ్‌ ఆంటోనిని అభినందిస్తున్నాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా భయపడి ఉండి వుంటే విజయ్‌ ఆంటోని హీరో అయి వుండేవాడు కాదు. కొత్త డైరెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్‌ చేస్తూ సినిమాలు చేస్తున్న విజయ్‌ ఆంటోనికి నా ధన్యవాదాలు. రవీందర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు, సన్నిహితుడు. కథ నచ్చితే బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాత రవీందర్‌రెడ్డి. అతను నిర్మిస్తున్న ఈ ‘యమన్‌’ చిత్రం పెద్ద హిట్‌ కావాలి. లైకా ప్రొడక్షన్స్‌ వారు ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా చేశారు. తమిళ్‌లో ‘కత్తి’ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ‘రోబో-2’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆ చిత్రం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. ‘యమన్‌’ చిత్రం లైకా ప్రొడక్షన్స్‌లో పెద్దహిట్‌ అవ్వాలి” అన్నారు.
Yamen Telugu Movie
హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ – ”వినాయక్‌గారు ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు తీశారు. రీసెంట్‌గా ‘ఖైదీ నంబర్‌ 150’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. మా చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయడానికి వచ్చిన వినాయక్‌ గారికి నా థాంక్స్‌. ఇది నా ఆరవ చిత్రం. పొలిటికల్‌ రివెంజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో డబుల్‌ రోల్‌ క్యారెక్టర్స్‌ చేశాను. వెరీ ఎంటర్‌టైనింగ్‌ అండ్‌ కమర్షియల్‌ మూవీ. డైరెక్టర్‌ జీవశంకర్‌ నేను ‘నకిలీ’ చిత్రం చేశాం. అది మంచి హిట్‌ అయింది. మళ్లీ మేమిద్దరం ‘యమన్‌’ చిత్రం చేస్తున్నాం. ఈ చిత్రానికి డైరెక్షన్‌తో పాటు అద్భుతమైన ఫొటోగ్రఫి అందించారు జీవ. ఈ చిత్రంలో 5 పాటలున్నాయి. నేనే మ్యూజిక్‌ చేశాను. త్వరలో ఆడియో రిలీజ్‌చేసి శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి భాషశ్రీ అద్భుతమైన పాటలు, మాటలు రాశారు. ప్రతిఒక్కరూ ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్‌ రాజా, మిర్యాల రవీందర్‌రెడ్డి గారికి నా థాంక్స్‌” అన్నారు.

- Advertisement -