త్వరలో ఉప్పల్ ఐటీ పార్కులకు శంకుస్థాపన: ఎర్రబెల్లి

147
errabelli
- Advertisement -

అతి త్వరలో ఉప్పల్ నియోజకవర్గానికి 5 ఐటీ పార్కులకు శంకుస్థాపన చేయబోతున్నాం అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ ఐటీ పార్కుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తాం అన్నారు. మీర్ పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ డివిజన్ లో డైమండ్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్ తో కలిసి ఓటు వేయమని అభ్యర్థించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ ఐదేండ్ల లో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాం….ఈ డివిజన్ లో వున్న సమస్యలను నిన్న కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళాను ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.

సీఎం కేసిఆర్,మంత్రి కేటీఆర్,నేను మేమంతా మాట అంటే మాట మీద నిలబడేవాళ్ళం…మీ సమస్యలు అన్ని తెలుసు ఎన్నికల తరువాత ఆ సమస్యలను తీర్చే బాధ్యత నాది అన్నారు. ఈ డివిజన్ లో TRS అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్ ని గెలిపించండి…నేను ఈ డివిజన్ ను దత్తత తీసుకొని కడిగిన ముత్యం లా చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -