చిరు లూసిఫర్ ఆసక్తికర అప్‌డేట్!

204
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆచార్య త‌ర్వాత చిరంజీవి వేదాలం, లూసిఫ‌ర్ రీమేక్‌ల‌ను చేయనున్నాడు. మోహన్‌లాల్‌ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్‌ చిత్రం ‘లూసీఫర్‌’ను తెలుగు నెటివిటీకు అనుగుణంగా త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా రీమేక్ చేయ‌నున్నార‌ట‌.

ఇప్పటికే పలువురు దర్శకుల చేతికి సినిమా కథ వెళ్లిన చివరగా తమిళ దర్శకుడే ఫైన్ అయ్యారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తుండగా మ‌ల‌యాళంలో మాదిరిగానే తెలుగులోను హీరోయిన్ లేకుండా షూట్ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదుగానీ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -