సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్‌..ఆ థియేటర్లు మూసివేత!

223
hyderabad theatres
- Advertisement -

హైదరాబాద్ ప్రజలు,సెలబ్రెటీలు,సినీ పరిశ్రమ వారికి ఇది బ్యాడ్ న్యూస్‌. నగరంలో ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని శ్రీ మయూరి, నారాయణగూడ శాంతి థియేటర్, బహదుర్ పుర శ్రీ రామ, టోలిచౌకి గెలాక్సీ, మెహదీపట్నం అంబ థియేటర్లు శాశ్వతంగా మూతపడనున్నాయి.

అయితే థియేటర్లతో సినీ ప్రియులు మరియు అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి.ఎన్నో గొప్ప సినిమాలు ప్రదర్శించి, ఘనమైన చరిత్ర కలిగిన ఈ థియేటర్లు మూసి వేయడం పట్ల సినీ ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

శాంతి థియేటర్‌ను గోడౌన్‌గా మార్చనుండగా అంబ థియేటర్‌కు కొన్ని పర్మిషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి కానీ క్లోజ్ చేయడం దాదాపు ఖరారు అయినట్లే.

- Advertisement -