ఎన్నికల సిబ్బందికి నేటి నుండి ఈ నెల 27 వరకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు ఎన్నికల కమిషనర్ పార్థసారథి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పరిశీలకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటిలోగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి చేయాలని, సర్వీస్ ఓటర్లకు ఇవాళ పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేయాలని సూచించారు.
రౌడీ షీటర్లను, సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేయాలని ఎస్‌ఈసీ పరిశీలకులను ఆదేశించారు. ప్రిసైడింగ్ సహాయ అధికారులకు ఇవాళ, రేపు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వెబ్‌కాస్టింగ్ వాలంటీర్లకు 27న, సూక్ష్మ పరిశీలకులకు 28న శిక్షణ ఉంటుందని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను పెంచాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. 2 హాళ్లలో కౌంటింగ్ జరిగే కేంద్రాల్లో అదనపు ఆర్వోను నియమించాలని సూచించారు.