క్రేజీ కాంబినేషన్ విష్ణు మంచు, శ్రీను వైట్ల పదమూడేళ్ల సుదీర్ఘ విరామంతో మరోసారి వస్తోంది. వారి బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఢీ’కి సీక్వెల్‌గా ‘డి & డి’ టైటిల్‌తో సినిమా చేయడానికి వారు రెడీ అవుతున్నారు. ‘డబుల్ డోస్’ అనేది ట్యాగ్‌లైన్. విష్ణు బర్త్‌డే సందర్భంగా సోమవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
టైటిల్ డిజైన్ చాలా ఇంటరెస్టింగ్‌గా అనిపిస్తోంది. సంకెళ్ల మధ్య రెండు ‘డి’ అక్షరాలను డిజైన్ చేశారు. ‘ఢీ’లో ఎంత కామెడీ, యాక్షన్ ఉన్నాయో అంతకు రెట్టింపు కామెడీ, యాక్షన్ ఈ సినిమాలో ఉంటాయనే సంకేతాన్నిస్తూ ‘డబుల్ డోస్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు స్వయంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అవరమ్ భక్త మంచు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘ఢీ’తో సహా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన పలు సినిమాలకు పనిచేసిన రచయిత గోపీమోహన్ ఈ చిత్రానికి మరో పాపులర్ రైటర్ కిషోర్ గోపుతో కలిసి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న యంగ్ సెన్సేషన్ మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తుండగా, మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.ఇండియాలో నంబర్ వన్ ఫైట్‌మాస్టర్‌గా పేరుపొందిన పీటర్ హెయిన్ ‘డి & డి’లోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను రూపొందించనున్నారు.ఎం.ఆర్. వర్మ ఎడిటర్‌గా, చిన్నా ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.విష్ణు జోడీగా ఎవరు నటించేదీ, ఇతర తారాగణం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
సాంకేతిక బృందం:
డైరెక్టర్: శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్: విష్ణు మంచు
సమర్పణ: అవరమ్ భక్త మంచు
బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
రైటర్స్: గోపీమోహన్, కిషోర్ గోపు
మ్యూజిక్: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: మోహనకృష్ణ
ఫైట్స్: పీటర్ హెయిన్
ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ
ఆర్ట్: చిన్నా
పీఆర్వో: వంశీ-శేఖర్