టీఆర్‌ఎస్‌ పేదల ప్రభుత్వం- మంత్రి కేటీఆర్‌

77
ktr meeting

మంత్రి కేటీఆర్ రోడ్ షో భాగాంగా ఎల్.బి.నగర్ – వనస్థలిపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పోయిన సారి ఇక్కడ గుడిసెలు తీసి డబుల్ బెడ్ రూములు కడుతామని చెప్పాము.. ఇక్కడే కట్టి చూపించాం..రూ.45 లక్షలు విలువ చేసే ఇళ్లను ఉచితంగా కట్టిచ్చాం. ఇటువంటివి మొత్తం 111 జాగాళ్ల కడుతున్నాం. ఏనుగు వెళ్ళింది..తోక మిగిలింది. తెరాస పేదల ప్రభుత్వం. హైదరాబాద్ లో అందరికి శాశ్వతంగా 20వేల లీటర్ల వరకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. వాహన పన్ను రద్దు చేసాం..ఇప్పుడే సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి తెలిపారు.

నగరంలో 5లక్షల సీసీ కెమెరాలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు కట్టుకున్నామని గర్వంగా చెబుతున్నా.. మరి భాజపా ఏం చేసింది…? ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు..? కేంద్రానికి రూపాయి మనం కడితే..కేంద్రం మనకి ఆటాన ఇస్తోంది. 6.50 లక్షల మంది వివరాలు ఇస్తాం.. కేంద్రాన్ని ఒప్పించి.. వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇవ్వండి..అప్పుడు దీపాలు పెట్టమంటే..దీపాలు పెడతాం..గిన్నెలు కొట్టమంటే కొడతాం..డ్యాన్స్ లు చేయమంటే చేస్తాం..అన్నారు. ఆరేళ్ళ నుంచి హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. మరి ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌ కావాలా.. గొడవల హైదరాబాద్‌ కావాల్నా మీరే ఆలోచించి ఓట్లు వేయాలని కేటీఆర్‌ కోరారు.