కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు.వేములవాడ రాజన్న కు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది.. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం మహాశివుడు భక్తులకు దర్శనమిచ్చాడు… తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలైన్లలో నిలుచుండి స్వామివారిని కొవి డ్ నిబంధనతో దర్శించుకొని కోడె మొక్కులు తీర్చుకున్నారు.
ఆలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు…సాయంత్రం స్వామి వారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.