ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం…

227
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు మంత్రి వర్గ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. త్వరలో జరుగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై కేబినెట్‌ ప్రధానంగా చర్చించనుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం తొలిసారి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.

దుబ్బాక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను మంత్రులతో కలిసి విశ్లేషించనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరుపనున్నారు.

- Advertisement -