ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆత్మహత్య..

178
asif-basra-
- Advertisement -

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఆసిఫ్ బస్రా ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఉరివేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. పెంపుడు కుక్క గొలుసుతో ఆయన ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా ఆయన డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

ఘటనా స్థలిని ఫోరెన్సిక్ నిపుణులు కూడా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. మరోవైపు ఆసిఫ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పర్జానియా, బ్లాక్ ఫ్రైడే, పీచే వంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఈయన ‘ఔట్ సోర్స్’ అనే హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఈయన రీసెంట్‌గా అమెజాన్‌ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్‌లో పాతాళ్ లోక్, వో, హోస్టేజ్ వంటి వెబ్ సిరీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -