పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు…

947
peddagattu jathara
- Advertisement -

తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళ లింగమంతులస్వామి (పెద్ద గట్టు) జాతరకు నగారా మోగింది..జాతర నిర్వహణ పై సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులు, యాదవ కుల పెద్దలు , రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు.సమావేశం లో యాదవ పెద్దల సలహా ,పూజారుల సూచనల మేరకు జాతర తేదీ లను ఖరారు చేశారు.

జాతర ప్రారంభానికి 15 రోజులు ముందు అంటే ఫిబ్రవరి 14 -2021 ఆదివారం రోజున దిష్టిపూజ మహోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ తదియ తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్టెను తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు. 2021 ఫిబ్రవరి 28 మాఘ బ”విదియ ఆదివారం రోజున ప్రారంభమైన ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది.గతం లో ఎన్నడూ ఇంత తొందరగా జాతరతేదీలను ఖరారు చేయలేదన్నారు యాదవ కుల పెద్దలు.

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయడానికి మంత్రి జగదీశ్ రెడ్డి గారికి ఉన్న ముందు చూపు ,ఆయన చొరవ వల్లే తేదీలను ఖరారు చేశామన్నారు.కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, జడ్పి టిసి జీడీ బిక్షం, కౌన్సిలర్ జటా వత్ లక్ష్మీ మకట్ లాల్, దేవాదాయ శాఖ అధికారుల తో పాటు ,పూజారులు మెంత బోయిన నాగయ్య, గొర్ల గన్నారెడ్డి, వెంకన్న, జటంగి నాగరాజు యాదవ్ , కోడి సైదులు యాదవ్,వెంకన్న యాదవ్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

జాతర కార్యక్రమాలు
ఫిబ్రవరి 14- 2021 న దిష్టి పూజ

ఫిబ్రవరి 28-2021 ఆదివారం రాత్రి కేసారం గ్రామం నుండి దేవర పెట్టె తీసుకువచ్చుట, గంపల ప్రదిక్షణ

మార్చి 01 -2021 సోమవారం, బోనాలు సమర్పించుట ముద్దెర పాలు ,జాగిలాలు

మార్చి 02-2021 మంగళ వారం, చంద్రపట్నం

మార్చి 03-2021 బుదవారం, పూజారులు నెలవారం చేయుట

మార్చి 04-2021 గురువారం, జాతర ముగింపు, మకరతోరణం ఊరేగింపు ఉండనుంది.

- Advertisement -