బిహార్…ఆధిక్యంలో ఆర్జేడీ కూటమి

180
tejaswi
- Advertisement -

బీహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అధికార జేడీయూ-ఎన్‌డీఏ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమికి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి మహాఘట్‌ బంధన్‌ 93 సీట్లలో ఆదిక్యం కొనసాగుతుండగా.. జేడీయూ-ఎన్‌డీఏ కూటమి 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ, మహాఘట్‌ బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీ ముఖ్య నేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌, బీజేపీ సీనియర్‌ నేత ప్రేమ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నేతలు లవ్‌ సిన్హా, సుభాషిని బుందేలా ఆదిక్యంలో ఉన్నారు.

బిహార్‌ బిజేపీ సీనియర్‌ నేత నంద కిశోర్‌ యాదవ్‌, జేడీయూ నేత జైకుమార్‌ సింగ్‌, బీజేపీ నేత శ్రేయాసి సింగ్‌, జడీయూ సీనియర్‌ నేత విజయ్‌ చౌదరి, జేఏపీ నేత పప్పు యాదవ్‌ వెనుకంజలో ఉన్నారు.బిహార్‌లోని మొత్తం అసెంబ్లీ సీట్లు 243. మేజిక్‌ ఫిగర్‌ 122.

- Advertisement -