ఢిల్లీలో బాణ సంచా అమ్మకం,వాడకం నిషేధం..

252
Cracker ban
- Advertisement -

రేపటి నుంచి ఈనెల 30 వరకు దేశ రాజధానిలో అన్ని రకాల బాణ సంచా అమ్మకం, వాడకం నిషేధం చేసినట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు విడుదల చేసింది. ఈనేపథ్యంలో దీపావళి సమీపిస్తున్న వేళ.. టపాసులపై నిషేధాన్ని విధిస్తూ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. నగరంలో కరోనా పరిస్థితి, సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమీక్షించారు. అనంతరం ఆ నిర్ణయాలను ట్విట్టర్‌లో వెల్లడించారు. దీపావళి రోజున ఢిల్లీ ప్రజలెవ్వరూ టపాసులు కాల్చకూడదు అని పిలుపునిచ్చారు.

గతేడాదిలానే ఈసారి కూడా టపాసులను కాల్చకుండానే దీపావళి జరుపుకుందామని సిఎం అన్నారు. నగరంలో వాయుకాలుష్యం, కరోనా వైరస్‌ నేపథ్యంలో టపాసులు కాల్చడం వల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుందన్నారు.ఢిల్లీలో పొగ కారణంగా సంభవించే మరణాలకు ఇదే ఆఖరు కావాలని ఆకాంక్షించారు. దీపావళికి అందరం లక్ష్మీపూజ జరుపుకుందాం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది దీపావళి రోజున ఎవ్వరూ బాణసంచాను కాల్చకూడదని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈసారి లక్ష్మీపూజ నిర్వహిస్తామని, అందరూ కలిసి దీపావళిని జరుపుకుందాం అని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.

- Advertisement -